వరంగల్‌ను టెక్స్‌టైల్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో మరో ముందడుగు పడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో నిర్మించే ప్రఖ్యాత కంపెనీ కిటెక్స్ వస్త్ర పరిశ్రమకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాబోయే రెండేళ్లలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో పరిశ్రమల ఏర్పాటు జరుగుతోందని చెప్పారు.
టెక్స్‌టైల్ పార్కులో 20వేల మందికి ఉపాధికి లభించనుందని.. వారిలో అధికంగా మహిళలకు అవకాశం ఉంటుందని తెలిపారు. వరంగల్‌లో ఐటీ కంపెనీల ఏర్పాటు కూడా జరుగుతోందన్నారు. ఇప్పటికే కొన్ని ఐటీ సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయని కేటీఆర్ వివరించారు. వచ్చే ఐదేళ్లలో వరంగల్ జిల్లాలోనే 50 వేల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు రానున్నాయని చెప్పారు.