ఏపీలో 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాకినాడ పర్యటనలో బిజిబిజీగా ఉన్న ఆయన ఇవాళ అన్నవరంలో టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్ర బాబు మాట్లాడుతూ.. ఎన్నికల్లో పొత్తుల ప్రస్తావన తెచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిఉందని అన్ని పార్టీలకు పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమం అనేది రావాలని.. దానికి తెలుగుదేశం నాయకత్వం వహిస్తుందన్నారు. అవసరమైతే ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమేనని ఈ సందర్భంగా చంద్రబాబు తేల్చిచెప్పేశారు.