ప్రముఖ మ్యూజిక్ డైరక్టర్.. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ కుమార్తె ఖతీజా రెహ్మాన్ తన భాయ్‌ఫ్రెండ్, ఆడియో ఇంజినీర్ రియాస్దీన్ షేక్ మొహ్మాద్‌ను పెళ్లి చేసుకున్నది. దీనికి సంబంధించి ఏఆర్ రెహ్మాన్ తన ఇన్‌స్టా ప్రొఫైల్‌లో పెళ్లి ఫోటోను షేర్ చేశారు.
ఆ దేవుడు ఈ జంటను దీవించాలని కోరుతూ ఆ ఫోటోకు ఆయన ట్యాగ్ చేశారు. జీవితంలో ఇది ఎంతో సంతోషకర దినమని, తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు ఖతీజా కూడా తన ఇన్‌స్టా పోస్టులో రాసింది.