ఏపీ అధికార వైసీపీ పార్టీకి చెందిన కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ సంజీవ్ కుమార్ ను సైబర్ నేరగాడు బురిడీ కొట్టించాడు. మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయ్యింది.. వెంటనే పాన్ నంబరుతో జత చేసి అప్ డేట్ చేసుకోవాలని సదరు ఎంపీకి మెసేజ్ వచ్చింది. దానిని నమ్మి లింకులో వివరాలు నింపి పంపగా ఓటీపీ వచ్చింది. ఓ వ్యక్తి ఎంపీకి ఫోన్ చేసి OTP, ఇతర వివరాలు తెలుసుకున్నాడు. వెంటనే అకౌంట్ నుంచి రూ.97,699 విత్ డ్రా అయ్యాయి. పోన్ చేయగా అసలు విషయం బయటపడగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.