జగిత్యాల జిల్లా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు జిల్లాలోని ప్రముఖ ఆలయం కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయానికి చేరుకున్న మంత్రి హరీశ్ రావు ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకు మందు ఆలయ ఈవో, ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. దర్శనానంతరం హరీశ్ రావు దంపతులకు అర్చకులు వేదాశీర్చనం అందజేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, రవి శంకర్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు.