దేశంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో కొత్తగా 3205 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కల్పి ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,30,88,118కి చేరాయి. వీటిలో ఇప్పటికే 4,25,44,689 మంది కోలుకున్నారు. మరో 5,23,920 మంది కరోనా మహమ్మారి భారీన పడి మృతిచెందారు.
అయితే ఇంకా 19,509 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 31 మంది వైరస్‌కు బలయ్యారు. 2802 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.గత కొన్నిరోజులుగా భారీగా రోజువారీ కేసులు నమోదవుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరిగింది. మొత్తం కేసుల్లో 0.05 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపింది. రికవరీ రేటు 98.74 శాతంగా ఉందని, మరణాల రేటు 1.22 శాతమని పేర్కొన్నది.