తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి.. బుట్ట బొమ్మ స్టార్ హీరోయిన్..యువతను తన అందాలతో మంత్రముగ్దులు చేసే పూజా హెగ్దే తన చిన్ననాటికి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో ‘హృతిక్ రోషన్ ‘కోయీ మిల్గయా’ సినిమా విడుదలైన సమయంలో నా వయసు పన్నెండేళ్లు. హృతిక్ అంటే విపరీతమైన అభిమానం. ఆయనతో ఫొటో దిగాలని ప్రీమియర్ షో కు వెళ్లాను. ఫొటో కోసం ప్రయత్నిస్తుంటే హృతిక్ స్టేజీ దిగి వెళ్లిపోయారు. ఒక్కసారిగా నా హృదయం ముక్కలైపోయిందనిపించింది. పదేళ్ల తర్వాత ఆయన సరసన ‘మొహంజొదారో’లో నటించాను’ అని గుర్తు చేసుకుంది .
