తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు సిద్దిపేట ఈద్గాలో జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రంజాన్ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు సంతోషంగా జరుపుకుంటున్నారని తెలిపారు.ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
రాష్ట్రంలోని పేద ముస్లిం ఆడపిల్లల వివాహాల కోసం షాదీముబారక్ పథకం తెచ్చామన్నారు. పేద ముస్లిం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను స్థాపించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలను సమానంగా గౌరవిస్తుందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పారూక్ హుస్సేన్,రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.