ఇల్లు అద్దెకు కావాలంటూ వెళ్లిన ఓ జంట చేసిన పని ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అద్దెకు ఉండేందుకు ఇల్లు చూస్తామంటూ ఇంట్లోకి ప్రవేశించిన ఓ యువతీ యువకుడు సరస సల్లాపాలతో ఆ ఇంటి యజమానికి అడ్డంగా దొరికేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్ వద్ద చోటుచేసుకుంది. బైక్‌పై ఓ ఇంటి వద్దకు వెళ్లిన యువతీ యువకుడు యజమానితో మాట్లాడారు. తాము భార్యాభర్తలమని.. అద్దెకు ఇల్లు చూస్తామని చెబితే యజమాని ఓకే అన్నాడు.
దీంతో ఆ బిల్డిండ్‌లోని రెండో అంతస్తుకు వెళ్లిన వారిద్దరూ అక్కడ గదిలో అసహ్యమైన పనుల్లో బిజీగా ఉండిపోయారు. ఎంతకీ వారిద్దరూ కిందికి రాకపోవడంతో యజమాని పైకి వెళ్లి చూసే సరికి ఆయన మైండ్ బ్లాంక్ అయిపోయింది. వెంటనే వాళ్లపై సీరియస్ అవడంతో వారు అక్కడి నుంచి కిందికి దిగి పారిపోయారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.