జి.కొత్తపల్లిలో వైసీపీ నేతలు తనపై దాడి చేయలేదని..టీడీపీ వాళ్లే వెనకుండి దాడి చేయించారని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. ఏలూరు జిల్లా జి.కొత్తపల్లిలో తనపై జరిగిన దాడి ఘటనపై ఎమ్మెల్యే స్పందించారు. జి.కొత్తపల్లిలో వైసీపీ నేతల మధ్య విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని.. వారి మధ్య వివాదాన్ని రాజీ చేసినట్లు చెప్పారు. వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్యపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకునేలా చూస్తామన్నారు.
హత్యకు గురైన గంజి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లగా ఎమ్మెల్యే వెంకట్రావుపై దాడి జరిగింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఎమ్మెల్యేలకు రక్షణగా నిలిచి అక్కడి నుంచి తీసుకెళ్లారు.