దొంగతనం ఆరోపణలతో ఓ సెక్యూరిటీ గార్డును కొందరు యువకులు చిత్రహింసలకు గురిచేశారు. తలకిందులుగా చెట్టుకు వేలాడదీసి చితకబాదారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. సివత్ పట్టణానికి చెందిన మహవీర్ను ఎవరూ లేని ప్రదేశానికి కొంతమంది యువకులు తీసుకెళ్లారు. చెట్టుకు వేలాడదీసి కర్రలు, ఇనుపరాడ్డులతో విపరీతంగా దాడి చేశారు. తనను వదిలిపెట్టాలని ఏడ్చినా ఆ యువకులు కనికరం చూపలేదు.
అయితే అటుగా వెళ్తున్న ఓ మహిళ చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సెక్యూరిటీ గార్డును రక్షించారు. ఈ ఘటనకు పాల్పడిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.