గుజరాత్ తీరంలోని పిపావావ్ పోర్టులో దాదాపు 90 కిలోగ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.450 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇరాన్ నుంచి ఆమ్రేలి జిల్లాలోని పిపావావ్ పోర్టుకు చేరుకున్న ఓ షిప్పింగ్ కంటెయినర్ నుంచి ఈ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
తనిఖీల నుంచి తప్పించుకునేందుకు డ్రగ్స్ అక్రమ రవాణాదారులు ప్రత్యేక పద్ధతి అవలంబించారని డీజీపీ అశిష్ భాటియా తెలిపారు. హెరాయిన్ ఉన్న ద్రావణంలో దారాలను నానబెట్టి, అవి ఆరిన తర్వాత బేల్స్‌గా చేసి ఎగుమతి చేసేందుకు బ్యాగుల్లో ప్యాకింగ్ చేశారని వివరించారు.