తండ్రి తనయులైన మెగా స్టార్ చిరంజీవి,మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆచార్య చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలతో శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే నెగిటీవ్ టాక్‌ను తెచ్చుకుంది. కథ భాగానే ఉన్న కథనం కొత్తగా లేదని కొరటాల మార్కు ఈ చిత్రంలో కనిపించలేదని ప్రేక్షకులు తెలిపారు. కొరటాల డైలాగ్స్, ఎలివేషన్స్ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి.
కాగా ఈ చిత్రం మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.29.52 కోట్ల షేర్‌ను సాధించింది. ఇప్పటికే కొన్ని చోట్ల డ్రాప్స్ కనిపిస్తున్నాయి. ఫైనల్‌గా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ను సాధిస్తుందో లేదో చూడాలి. ఇదిలా ఉంటే ఆచార్య ఓటీటీ ఎంట్రీపై ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.ఆచార్య సినిమా డిజిటల్ విడుదలకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమేజాన్ ప్రైమ్ ఆచార్య డిజిటల్ రైట్స్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
మేకర్స్ కుదిరించుకున్న డీల్ ప్రకారం సినిమా విడుదలైన మూడు వారాల తర్వాత ఆచార్య డిజిటల్‌లో విడుదల కావాలి. ఈ క్రమంలో మే చివరి వారంలోపు ఆచార్య డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్. దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆచార్య పాత్రలో చిరంజీవి నటించిగా, సిద్ద పాత్రలో రామ్‌చరణ్ నటించాడు. మ్యాట్నీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చరణ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.