Home / SLIDER / సంపద సృష్టిస్తున్నాం.. ప్రజలకు పంచుతున్నాం: మంత్రి కేటీఆర్‌

సంపద సృష్టిస్తున్నాం.. ప్రజలకు పంచుతున్నాం: మంత్రి కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్నాం, దానిని ప్రజలకు పంచుతున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో ఏ మూలకెళ్లినా ఎకరం భూమి విలువ రూ.15 లక్షలకు తక్కువగా లేదని చెప్పారు. రాష్ట్రం సిద్ధించినప్పుడు మన తలసరి ఆదాయం రూ.లక్షా 24 వేలు అని, ఏడేండ్ల తర్వాత అది రూ.2.78 లక్షలకు చేరిందన్నారు. మాదాపూర్‌ హైటెక్స్‌లో జరుగుతున్న క్రెడాయ్‌ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యవసాయం తరువాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్నది నిర్మాణరంగమేనని చెప్పారు. దేశంలో 70 శాతం మంది గ్రామాల్లో నివసిస్తున్నారని, నిర్మాణ రంగం వల్ల సంపద సృష్టి జరుగుతున్నదని తెలిపారు.


హైదరాబాద్‌ లాంటి నగరాలే దేశానికి ఆర్థిక శక్తిగా ఉన్నాయని వెల్లడించారు. నగరాల విస్తరణకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాలన్నారు. దేశంలో సంపద సృష్టించే నగరాల అభివృద్ధి కోసం ఏటా రూ.10 వేల కోట్లు కేటాయించాలని ప్రధాని మోదీని సీఎం కేసీఆర్‌ కోరారని, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.మౌలిక వసతుల కల్పనలో..మౌలిక వసతుల కల్పనలో హైదరాబాద్‌ అన్ని నగరాల కంటే ముందున్నదని కేటీఆర్‌ అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల వారు నగరంలో స్థిరపడ్డారని చెప్పారు. కొవిడ్‌ సమయంలో ఇతర రాష్ట్రాల రోగులు ఇక్కడ వైద్యం చేయించుకున్నారని వెల్లడించారు. హైదరాబాద్‌ హెల్త్‌, ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారిందని పేర్కొన్నారు.

హైదరాబాద్‌ను ట్రీ సిటీగా ఐక్యరాజ్యసమితి గుర్తించిందని తెలిపారు. నగర అభివృద్ధిపై బీజేపీ ఎంపీలే ప్రశంసలు కురిపిస్తున్నారని చెప్పారు.గతంలో ఎండాకాలం వస్తే జలమండలి ముందు ధర్నాలు జరిగేవని, ఇప్పుడు హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేకుండా చేశామని వెల్లడించారు. గతంలో ఏ పండుగ వచ్చినా అల్లర్లు జరిగేవి, తెలంగాణ వచ్చిన తర్వాత కుల, మత అల్లర్లు లేవన్నారు.అవినీతికి ఆస్కారం లేదు.తెలంగాణలో పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతున్నదని చెప్పారు. తెలంగాణ రాకముందు కరెంటు కోతలు ఉండేవని, రాష్ట్రం వచ్చిన తర్వాత ఆరు నెలల్లోనే ఆ సమస్య లేకుండా చేశామన్నారు. సాగుకు 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో బిల్డింగ్‌ కట్టాలంటే లంచాలు చెల్లించాల్సిందేనని, కానీ రాష్ట్రంలో భవనాల అనుమతుల్లో అవినీతి లేకుండా చేశామన్నారు.2022 నాటికి అందరికీ ఇండ్లు కట్టిస్తామని ఒక పెద్దాయన చెప్పాడని ప్రధాని మోదీని ఉద్దేశించి అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రగల్భాలు పలికారని విమర్శించారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat