మహబూబాబాద్ మండలంలోని ముడుపుగల్ మరియు అమనగల్ గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలను ప్రారంభించిన మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ..మహబూబాబాద్ మండలంలోని ముడుపుగల్ గ్రామంలో ఎన్ హెచ్ యం నిధుల నుండి 16.00 లక్షలు . మరియు అమనగల్ గ్రామంలో ఎన్ హెచ్ యం నిధుల నుండి 16.00 లక్షల నిధులతో ఆరోగ్య ఉపకేంద్రాలను ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి లో ముందుకు వెళ్తుందని ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని తెలిపారు ..గ్రామ గ్రామన పల్లె దవాఖానలు బస్తి దవాఖానలు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ప్రియతమ నాయకులు మన కేసీఆర్ గారి ప్రభుత్వం అని కొనియాడారు ..ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి హరీష్ రాజ్ , ఎంపీపీ మౌనిక సురేందర్ , జడ్పీటీసీ లునవాత్ ప్రియాంక , పిఏసీఎస్ చైర్మన్ రంజిత్ , తెల్ల శ్రీనివాస్ , యాస వెంకట్ రెడ్డి , లునవాత్ అశోక్ , నర్సింగ్ వెంకన్న , సంద వీరన్న , షరీఫ్ , వివిధ గ్రామాల సర్పంచులు , ఎంపీటీసీలు , రైతు కోర్దినేటర్లు , తెరాస ముఖ్యనాయకులు , అధికారులు , మరియు తదితరులు పాల్గొన్నారు ..