తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి,ముఖ్యమంత్రి కేసీఆర్ తో జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ నిన్న గురువారం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో భేటీ అయిన సంగతి విదితమే. ఈ సమావేశంలో ప్రస్తుత సమకాలిన జాతీయ రాజకీయాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించినట్లు సమాచారం . మొన్న బుధవారం నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీలో ఆమోదించిన తీర్మానాలపై ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ఆరా తీసినట్లు తెలుస్తుంది. దేశంలో బీజేపీయేతర రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వమైన బీజేపీ సర్కారు చూపుతున్న వివక్ష ,చమురు ధరలపై వైఖరి తదితర అంశాల గురించి ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. వీరి భేటీ దాదాపు గంటపాటు జరిగింది.