పిల్లలు, వృద్ధులతోపాటు అతిగా మద్యం తాగితే ఎండకాలం ఎక్కువగా వడదెబ్బ బారినపడే ప్రమాదం ఉంటుంది. అప్పుడప్పుడు మద్యం సేవించేవారు కాకుండా నిత్యం మద్యం తాగేవారు మాత్రం వేసవిలో జాగ్రత్తగా ఉండాలి. వారి శరీరంలోకి చేరిన మద్యం నీటిని నిల్వ చేయనివ్వదు. దీంతో దాహం పెరిగిపోతుంది. విపరీతమైన జ్వరం, నోరు తడారిపోవడం, తలనొప్పి, నీరసం, మూత్రం రంగు మారడం, కళ్లు తిరగడం వంటి లక్షణాలుంటే వడదెబ్బగా గుర్తించాలి.
