KKR తో నిన్న గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ రికార్డు సృష్టించాడు. మరోసారి తుఫాన్ ఇన్నింగ్స్ ఆకట్టుకుని ఐపీఎల్ క్రికెట్ లో రెండు జట్లపై 1000కి పైగా పరుగులు చేసిన తొలి బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. కేకేఆర్ పై 26 మ్యాచ్లలో 1008 పరుగులు పూర్తి చేశాడు వార్నర్.. అంతకుముందు పంజాబ్ కింగ్స్ పై 22 ఇన్నింగ్స్ లో మొత్తం 1005 రన్స్ చేశాడు.
