తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఏపీ మంత్రి ఆర్కే రోజా కలిశారు. తన కుటుంబంతో కలిసి ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సీఎం కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నట్లు చెప్పారు. కేసీఆర్‌కు ఆయన ఫొటో ఫ్రేమ్‌ను జ్ఞాపికగా రోజా అందజేశారు.
అంతకుముందు రోజాకు సీఎం సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత స్వాగతం పలికారు. భర్త సెల్వమణి, కుమార్తె, కుమారుడితో కలిసి రోజా ప్రగతిభవన్‌కు వెళ్లారు.