తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ సీనియర్ స్టార్ హాట్ హీరోయిన్ సమంత పుట్టినరోజు ఈ రోజు . ఈ క్రమంలో సమంత నటిస్తున్న తాజా లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’ నుంచి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసి శుభాకాంక్షలు తెలిపింది ఆ చిత్రబృందం. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో సమంత టైటిల్ పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ మొదటిసారి చైల్డ్ ఆర్టిస్టుగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తూ భరతుడి పాత్రలో కనిపించబోతోంది. ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్, గుణ టీమ్ వర్క్స్ బ్యానర్స్‌పై దిల్‌రాజు, నీలిమ గుణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే, సమంత బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి తాజాగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు..
ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో అభిమానులు సమంతకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. కాగా, సమంత నటించిన తమిళ మల్టీస్టారర్ ‘కాతు వాక్కుల రెండు కాదల్’ ( కణ్మణి రాంబో ఖతీజా ) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక యశోద సినిమా షూటింగ్‌లోనూ ఆమె పాల్గొంటోంది.
Wishing.. the Ethereal.. “Shakuntala” from #Shaakuntalam our @Samanthaprabhu2 a very Happy Birthday ?@Samanthaprabhu2 @Gunasekhar1@ActorDevMohan #ManiSharma @neelima_guna @GunaaTeamworks @DilRajuProdctns @SVC_official@tipsofficial #MythologyforMilennials#HBDSamantha pic.twitter.com/rjijMag8mu
— Gunaa Teamworks (@GunaaTeamworks) April 28, 2022