అమెరికా తర్వాత రెండో అతిపెద్ద క్యాంపస్‌కు గూగుల్ సంస్థ శ్రీకారం చుట్టింది. అమెరికాలోని మౌంటెన్‌వ్యూలోని తమ హెడ్‌క్వార్టర్ తర్వాత హైదరాబాద్‌లో 3.3లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్‌ను స్థాపించనుంది. ఈ క్యాంపస్‌కు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది.
విద్య, పౌరసేవలతో పాటు ఇతర రంగాల్లో గూగుల్ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి టెక్నికల్ సపోర్ట్ అందించనుంది. ఇప్పటికే గూగుల్‌తో కలిసి అనేక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నామని.. ఈ ఒప్పందంతో మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుందని చెప్పారు. హైదరాబాద్‌లో గూగుల్ తన మూలాలను మరింత బలోపేతం చేసుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు.