నల్గొండ పట్టణంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులని అధికారులను తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత కూడా పనుల్లో జాప్యం చేయడంపట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా అభివృద్ధి పనులపై నార్కట్‌పల్లిలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే మొదలు పెట్టిన పనుల పురోగతిని ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు.
చిరుమర్తి లింగయ్య కుటుంబానికి పరామర్శ
అంతకుముందు సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల లింగయ్య తండ్రి నర్సింహ మృతిచెందారు. దీంతో ఈరోజు నార్కల్‌పల్లిలోని రాశి ఫ్యాక్టరీ వద్ద నిర్వహించిన దశదిన కర్మకు కేసీఆర్ హాజరయ్యారు. నర్సింహ చిత్రపటం వద్ద సీఎం నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్, జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు పాల్గొన్నారు.