దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి రావాల్సిన అవసరం ఉందని.. అందుకే జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టినట్లు టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. టీఆర్‌ఎస్ ప్లీనరీ సభలో ఆయన ముగింపు ప్రసంగం చేశారు. ఒక లక్ష్యంతో పనిచేస్తే అమెరికాను మించిన ఆర్థిక శక్తిగా భారత్ అవతరిస్తుందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 90కి పైగా స్థానాలు టీఆర్‌ఎస్‌వేనని.. ఈ విషయాన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు.
ప్రసంగంలో భాగంగా టీఆర్‌ఎస్ పార్టీకి ఉన్న నిధులు, ఇతర వివరాలను కేసీఆర్ వివరించారు. టీఆర్ఎస్ పార్టీకి నగదు రూపంలో రూ.865కోట్ల నిధులు బ్యాంకుల్లో ఉన్నాయని.. ఇవి కాకుండా పార్టీ కార్యాలయాల విలువ సుమారు 1000 కోట్లకు పైనే ఉంటుందని చెప్పారు. పార్టీకి 60లక్షల మంది సభ్యులు ఉన్నారని.. దేశ రాజకీయాలకు వెళ్తున్నామని పిలుపునిస్తే ఆర్థికవనరులు అవే సమకూరుతాయన్నారు. ఒక్కో సభ్యుడు రూ.వెయ్యి విరాళం ఇచ్చినా పార్టీకి రూ.600 కోట్లు సమకూరుతాయని చెప్పారు.