మీరు చదివిన వార్త నిజమే. చందమామను అణుబాంబులతో పేల్చేయాలని ప్రపంచంలోనే అగ్రదేశమైన అమెరికా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. చందమామను అణుబాంబులతో పేల్చేయాలని.. అక్కడ ఉన్న ఖనిజ సంపదను దోచుకోవాలని అమెరికా ప్రయత్నాలు మమ్మురం చేసింది.
ఇందులో భాగంగా రహస్యంగా ఓ ప్రభుత్వ విభాగాన్ని సైతం అమెరికా ఏర్పాటు చేసినట్లు సమాచారం. చంద్రుడ్ని ఎలా పేల్చివేయాలనే దానిపై పరిశోధనలకు దాదాపు వందల కోట్లు ఖర్చు చేసినట్లు గుసగుసలు. ఆ రహస్య విభాగం పేరు ఏఏటీఐపీ.. దీన్ని దాదాపు పదిహేనేండ్ల కిందటనే అంటే 2007లో ఏర్పాటు చేశారు.
ఆ తర్వాత అమెరికా ఆ ప్రయత్నాలను విరమించుకొన్నది.ఏఏటీఐపీని 2017లో రద్దు చేశారు.ఏఏటీఐపీ ప్రతిపాదనలు ,పరిశోధనల నివేదిక ఇటీవల బయటకు రావడంతో చంద్రుడి కేంద్ర మండలంలో ఉన్న అతి తేలిక లోహాల కోసం ఉపరితలం నుండి ఆరువందల అరవై కిలోమీటర్ల లోతు వరకు టన్నెళ్ళు నిర్మించాలని ఏఏటీఐపీ ప్రతిపాదించింది. అయితే ఈ వార్తలపై అమెరికా ఇంతవరకు క్లారిటీవ్వలేదు.