దేశంలో మళ్లీ కరోనా ఉద్ధృతి కలవరపెడుతున్నాదా..?. గతంలో మాదిరిగా మళ్లీ కరోనా ఫోర్త్ వేవ్ రానున్నదా..? అంటే ప్రస్తుతం దేశ రాజధాని మహానగరం ఢిల్లీతో సహా పన్నెండు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యను బట్టి అవుననే చెప్పాలి.
ఈ వారం వ్యవధిలోనే కేసుల సంఖ్య రెట్టింపవ్వడం కలవరపెడుతుంది.మొన్న ఆదివారం ఒక్క రోజే దేశ వ్యాప్తంగా కొత్తగా 2,541మందికి కరోనా పాజిటీవ్ అని నిర్ధారణ అయింది.దీంతో సోమవారం నాటికి కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 16,522కి చేరుకుంది.
తాజా కేసుల సంఖ్య నమోదును చూస్తుంటే త్వరలోనే కరోనా ఫోర్త్ వేవ్ రానున్నది అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే కేంద్రం కరోనా కేసులు నమోదు తక్కువగా అవుతున్నాయని నిర్లక్ష్య దోరణితో టీకాలు అందించడం తగ్గడమే ఇందుకు కారణం అని సర్వత్రా విమర్షలు ఊపందుకుంటున్నాయి.