ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర లేకపోతే దాని ప్రభావం మనసుపై పడుతుంది. రాత్రి వేళ ఫోన్ పక్కనపెట్టి నిద్రపై దృష్టి పెట్టాలి. నట్స్, డార్క్ చాక్లెట్, ఓట్స్, బెర్రీస్, అరటి వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. చక్కెర, కెఫిన్ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. నిద్రకు ముందు వీటిని అస్సలు తీసుకోవద్దు. మానసిక ప్రశాంతతకు వ్యాయామం అవసరం. రోజూ కనీసం ఓ అరగంటైనా వ్యాయామం చేయండి.
