కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సంసద్ ఆదర్శ గ్రామీణ యోజనలో దేశవ్యాప్తంగా మొదటి 10 స్థానాలతో పాటు మొదటి 20లోనూ 19 తెలంగాణ గ్రామాలే ఉండటం గర్వకారణమని మంత్రి కేటీఆర్ అన్నారు. పల్లె ప్రగతి లాంటి ప్రత్యేక కార్యక్రమాలు అమచేస్తున్న సీఎం కేసీఆర్కు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఆయన బృందానికి అభిందనలు తెలిపారు.
సంసద్ ఆదర్శ గ్రామీణ యోజనలో యాదాద్రి భువనగిరి జిల్లా వాడపర్తి దేశంలోనే తొలి స్థానంలో ఉండగా.. కరీంనగర్ జిల్లా కొండాపూర్, నిజామాబాద్ జిల్లాలోని పల్డా గ్రామాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. కరీంనగర్ జిల్లా రామకృష్ణాపూర్, యాదాద్రి జిల్లా కొలనుపాక, నిజామాబాద్ జిల్లా వెల్మల్, జగిత్యాల జిల్లా మూలరాంపూర్, నిజామాబాద్ జిల్లాలోని తానా కుర్ద్, కుక్నూర్, కరీంనగర్ జిల్లా వెన్నంపల్లి మొదటి 10 స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాను మంత్రి కేటీఆర్ ట్విటర్లో షేర్ చేశారు.