కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) చేరిక ఖాయమైందనుకున్న సమయంలో ఆ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రశాంత్ కిషోర్ అంగీకరించలేదు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మరో వైపు ఇదే విషయంపై కాంగ్రెస్ ముఖ్యనేత రణ్‌దీప్‌సింగ్ సూర్జేవాలా కూడా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో పీకే చేరడం లేదని చెప్పారు. కాంగ్రెస్‌లో చేరాలని సోనియాగాంధీ కోరినా పీకే తిరస్కరించారని తెలిపారు.
పార్టీలో చేరి ఎన్నికల బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిందని.. అయితే దాన్ని తాను తిరస్కరించినట్లు ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ఆ పార్టీకి తన అవసరం కన్నా.. నాయకత్వం, సమష్టి సంకల్పమే అవసరమని చెప్పారు. కాంగ్రెస్‌లో చేరకుండా కేవలం సలహాదారుగా మాత్రమే పనిచేస్తానని పీకే క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ట్విటర్‌లో ఆయన పేర్కొన్నారు.