తెలంగాణలో పేదింటి ఆడపిల్లల వివాహానికి అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం మరో మైలురాయిని చేరుకుంది. ఈ పథకానికి ప్రభుత్వం నిన్న రూ. 1850 కోట్లు విడుదల చేసింది. దీంతో 2014 అక్టోబరు 2న పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రూ.11,653 కోట్లు ఖర్చుచేసినట్లయ్యింది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 12,87,588 మందికి.. రూ.1,00,116 చొప్పున ఆర్థిక సాయం అందించినట్లు ప్రభుత్వం తెలిపింది.
Tags kalyana lakshmi kalyanalaxmi kcr ktr ktrtrs slider telanganacm telanganacmo telanganagovernament trsgovernament trswp