నిన్నశనివారం రాత్రి జరిగిన రెండో పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 16.1 ఓవర్లలో 68 పరుగులకు ఆలౌటైంది.సుయాశ్ ప్రభుదేశాయ్ (15), మ్యాక్స్‌వెల్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు నమోదు చేయగా.. డుప్లెసిస్ (5), విరాట్ కోహ్లీ (0), అనూజ్ రావత్ (0), షాబాజ్ అహ్మద్ (7), దినేశ్ కార్తీక్ (0) ఘోరంగా విఫలమయ్యారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే మూడు వికెట్లు పడగొట్టిన మార్కో జెన్సెన్ (3/25).. బెంగళూరును భారీ దెబ్బ కొట్టాడు. ఇక ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయిన బెంగళూరు.. లీగ్‌లో తమ రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసుకుంది. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో హైదరాబాద్ 8 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 72 పరుగులు చేసింది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (28 బంతుల్లో 47; 8 ఫోర్లు, ఒక సిక్సర్) దంచికొట్టగా.. కెప్టెన్ విలియమ్సన్ (16 నాటౌట్) అండగా నిలిచాడు. జాన్సెన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
స్కోర్ బోర్డ్ : బెంగళూరు: 16.1 ఓవర్లలో 68 ఆలౌట్ (ప్రభుదేశాయ్ 15; నటరాజన్ 3/10, జాన్సెన్ 3/25)
హైదరాబాద్: 8 ఓవర్లలో 72/1 (అభిషేక్ శర్మ 47, విలియమ్సన్ 16 నాటౌట్).