తెలంగాణకు రావాల్సిన రూ.7,183 కోట్లు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, దమ్ముంటే ఆ నిధులను తీసుకురావాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లకు మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. ఒక అబద్ధాన్ని మళ్లీ మళ్లీ చెప్పి నిజమని చిత్రీకరించేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
శనివారం టీఆర్‌ఎ్‌సఎల్పీలో మీడియా సమావేశంలో పీయూసీ చైర్మన్ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, చంటి క్రాంతికిరణ్‌లతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ అన్నీ అబద్ధాలే చెబుతున్నారని, తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులను కేంద్ర సర్కారు ఇవ్వడం లేదన్న వాస్తవాన్ని ప్రజలకు వివరించాలన్నారు.