తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కొత్తగా 1,016 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కారుణ్య నియామకాలను చేపట్టాలని తీర్మానించారు. బస్టాండ్లలో ఫార్మసీ సేవలు తీసుకురావాలని నిర్ణయించారు. తార్నాక ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ స్థాయికి పెంచాలని తీర్మానించారు.
