మమత మెడికల్ కాలేజ్‌లో 20 ఏళ్లుగా పీజీ ప్రవేశాలు పారదర్శకంగా జరుగుతున్నాయని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. పీజీ మెడికల్ సీట్ల ఆరోపణలపై గవర్నర్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పువ్వాడ మీడియాతో మాట్లాడారు. రేవంత్ ఫిర్యాదు చేయడాన్ని ఆయన ఖండించారు.
సీట్లు బ్లాక్ చేసి దందా చేయాల్సిన అవసరం మాకు లేదని.. ఒక్క సీటైనా బ్లాక్‌చేసినట్లు నిరూపిస్తే ప్రభుత్వానికి సరెండర్ చేస్తానని మంత్రి సవాల్ చేశారు. ఈ ఆరోపణలను వెనక్కి తీసుకోకపోతే రేవంత్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. తమపై చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే రేవంత్ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని పువ్వాడ అజయ్ డిమాండ్ చేశారు.