మహారాష్ట్ర ఎంపీ,ప్రముఖ నటి నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త రవి రాణా(ఎమ్మెల్యే)కు పోలీసులు నోటీసులు పంపించారు. వారిద్దరూ కలిసి మహరాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం ఎదుట హనుమాన్ చాలీసా పారాయణం చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. దీంతో అలర్టైన ముంబై పోలీసులు వారికి నోటీసు పంపారు. హనుమాన్ జయంతి రోజున హనుమాన్ చాలీసా చదివేందుకు శివసేన అధిష్ఠానం అనుమతించనందునే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని నవనీత్ దంపతులు చెప్పారు.
