తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మలేరియా కేసుల నియంత్రణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ కృషికి జాతీయ గుర్తింపు దక్కింది. గత ఆరేళ్లలో (2015-2021) రాష్ట్రంలో మలేరియా కేసులు గణనీయంగా తగ్గాయని కేంద్రప్రభుత్వం ప్రశంసించింది. ఈ మేరకు కేంద్రం రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు లేఖ పంపింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి వల్లే ఇది సాధ్యమైందన్నారు.