ఒకపక్క దేశంలో రోజురోజుకు కరోనా కేసులు కొత్తగా నమోదవుతున్న సంఖ్య పెరుగుతున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో అయితే ఐదోందల రెట్లు కేసులు నమోదు అవుతున్నాయి.దేశమంతా ఈ కరోనా వేవ్ తో భయపడుతుంటే ఏపీలో శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి గ్రామంలో ఓ వింత భయంతో ఊరంతా లాక్ డౌన్ విధించుకున్నారు.
గ్రామాన్ని ఆత్మలు చుట్టుముట్టాయన్న మూఢనమ్మకంతో ఆ గ్రామస్తులు స్వీయ లాక్ డౌన్ ప్రకటించుకున్నారు. ఏఫ్రిల్ పదిహేడు నుండి ఇరవై ఐదు తారీఖు వరకు ఆంక్షలు కొనసాగుతాయని గ్రామస్థులు తెలిపారు.
ఈ రోజుల్లో ఎవరు కూడా గ్రామం దాటి బయటకు ఎవరు వెళ్లోద్దు. ఎవరు గ్రామంలోకి రావోద్దు అని గ్రామ పెద్దలు ఆదేశించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకోని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలాంటివి భవిష్యత్తులో చర్యలు చేపడితే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు.