ఐపీఎల్ -2022 సీజన్ లో ముంబై ఇండియన్స్ కు ఇంకా ఛాన్స్ ఉందా?.. ఐపీఎల్ మొదలైన దగ్గర నుండి నేటి వరకు మొత్తం ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ కి ఈ ఐపీఎల్-2022 సీజన్ లో వరుసగా 7వ ఓటమి ఎదురైంది.
తన చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ తో అత్యంత ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓడింది. ఈ సీజన్ లో ముంబై ఆడిన తొలి 7 మ్యాచుల్లోనూ ఓడిన తొలి జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. తాజా ఓటమితో దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించినట్లయింది. ప్లేఆఫ్స్ క్వాలిఫై కావాలంటే ముంబైకి కేవలం 0.134% మాత్రమే అవకాశం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ (4.87%) కి కూడా ఈజీ కాదు.