Home / SLIDER / “సహజ “బ్రాండ్ పేరుతో 100 రకాల నిత్యావసరాలను మార్కెట్లోకి విడుదల

“సహజ “బ్రాండ్ పేరుతో 100 రకాల నిత్యావసరాలను మార్కెట్లోకి విడుదల

మహిళలను ఆర్థికంగా శక్తివంతులను చేసేందుకు,వారి ఆత్మ గౌరవాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. అందులో భాగంగానే తమ ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ, కార్పోరేషన్ నిత్యావసరాలను ఉత్పత్తి చేసి, మార్కెట్లోకి విడుదల చేసేందుకు “సహజ”బ్రాండ్ ను రూపొందించిందన్నారు.మంత్రి ఈశ్వర్ నియోజకవర్గం ధర్మపురికి చెందిన సుమారు 200మంది మహిళలు మేడ్చెల్ లోని మమతా, జీడిమెట్ల సుభాష్ నగర్ లో ఉన్న శ్రీయోగి, మణికంఠ మినీ ఇండస్ట్రీలను గురువారం సందర్శించారు.

అక్కడ తయారవుతున్న సరుకులు,వస్తువులు, ఉత్పత్తుల తయారీ,ప్యాకింగులను పరిశీలించి, మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, సహజ బ్రాండ్ ద్వారా ఇప్పటికే సబ్బులు,నూనెలు మార్కెట్లోకి విడుదల చేశాం, రానున్న రోజుల్లో 100 నిత్యావసరాలను వినియోగదారులకు అందిద్దామన్నారు.సూపర్ ఫైన్ బియ్యం కోసం మనం ఇతర ప్రాంతాలపై ఏ మాత్రం ఆధారపడకుండా, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో పండించే వడ్లను సేకరించి మిల్లింగ్ చేపిద్దామన్నారు.

దేవిధంగా మిరపకాయలు,ముడి పసుపు, కందులు, పెసళ్లు, చింతపండు కూడా సేకరించి, శుభ్రపర్చి, అవసరమైన వాటిని మిల్లింగ్ చేయించి, సహజ బ్రాండ్ ప్యాకింగులతో మార్కెట్లోకి విడుదల చేస్తే మంచి లాభాలు పొందొచ్చని చెప్పారు.షాపులు, గోదాములు కూడా ఏర్పాటు చేసుకుందామని, నాణ్యమైన సరుకులు, ఉత్పత్తులు, వస్తువులను అందించడం ద్వారా “సహజ”బ్రాండ్ సహజమైన విజయాలు సాధిస్తుందని.. అద్భుతాలు నమోదు చేస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణలో వనరులకు ఏ మాత్రం కొరత లేదని, నీళ్లు, విద్యుత్, నిధులు పుష్కలంగా ఉన్నాయని, ప్రభుత్వం సబ్సిడీలిస్తూ గొప్పగా ప్రోత్సహిస్తున్నది పేర్కొన్నారు.మీరంతా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆర్థికంగా ఎదగాలని, కుటుంబానికి కొండంత అండగా ఉండాలని మంత్రి ఈశ్వర్ ఉద్బోధించారు.ఈ దిశగా మనమందరం మంచి ఆలోచనలు, కార్యాచరణతో ముందుకు సాగుదామని కొప్పుల మహిళలను ప్రోత్సహించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat