టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్‌లో అత్యాచార ఘటనపై విచారణ చేసేందుకు వెళ్లిన తనను అడ్డుకుని దూషించారంటూ చంద్రబాబు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమపూ ఏపీ మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ అభియోగాలు మోపారు. అత్యాచార బాధితురాలిని కలిసేందుకు వెళ్లిన సమయంలో చంద్రబాబుతో వచ్చిన నేతలు అడ్డుకుని గొడవకు దిగి ఉద్రిక్త పరిస్థితులు కల్పిచారని.. గౌరవ ప్రదమైన హోదాలో ఉన్నవారిని ఇలా అవమానించడం తీవ్రంగా పరిగణిస్తున్నామని ఆరోపించారు.
ఈ క్రమంలో 1998 ఏపీ మహిళా కమిషన్ చట్టంలోని సెక్షన్-14 ప్రకారం కమిషన్‌కు కోర్టు తరహాలో విచారణ జరిపే అధికారాలు ఉన్నాయని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈనెల 27న ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని మహిళా కమిషన్ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.