తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెనువిషాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత ,ఎగ్జిబిటర్ నారాయణ దాస్ కె నారంగ్ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.అయితే గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నారాయణ దాస్ నిన్న మంగళవారం ఉదయం కన్నుమూశారు.
ఆయన మృతి పట్ల సినీ రంగానికి చెందిన ప్రముఖులు తమ సంతాపం తెలుపుతున్నారు. 1946 జూలై ఇరవై ఏడున జన్మించిన నారాయణ దాస్ పంపిణీ రంగంలోకి మొదట అడుగు పెట్టి ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించి ప్రముఖ నిర్మాతగా ఖ్యాతి చెందారు. గ్లోబల్ సినిమాస్ ,ఏషియన్ గ్రూప్ సంస్థలను స్థాపించి హైదరాబాద్ మహనగరంలో మల్టీపెక్సులను ప్రారంభించారు.
నగరంలో ఈ మల్టీపెక్సులతో సినిమా ప్రదర్శనలకు మరింత ఉత్సాహాన్ని అందించారు ఆయన. ఫైనాన్సియర్ గా ఎగ్జిబిటర్ గా నిర్మాతగా ఆయన సినిమా పరిశ్రమ అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. ఆయనకు ఇద్దరు కుమారులు..ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారులు సునీల్ నారంగ్ ,భరత్ నారంగ్ నిర్మాతలుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.