తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని పద్దెనిమిది సర్కారు దవాఖానాల్లో రోగుల వెంట వచ్చే సహాయకుల కోసం రూ.5కే రుచికరమైన ఇంటి భోజనం అందించనున్నట్లు ప్రకటించింది.
ఇందులో భాగంగా రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ డా. ఎర్రోళ్ళ శ్రీనివాస్ సమక్షంలో టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ,హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం సర్కారు దవాఖానాల్లో రోగుల సహాయకులకు మూడు పూటల భోజనం అతితక్కువ ధరకే అందుబాటులోకి వస్తుంది.ప్రభుత్వం తరపున గ్రేటర్ పరిధిలోని పద్దెనిమిది సర్కారు దవాఖానాల కోసం రూ.38.86కోట్లు ఖర్చు చేయనున్నది. రోగుల సహాయకులు ఈ భోజనం కోసం రూ ఐదు చెల్లిస్తే ప్రభుత్వం ట్రస్ట్ కు రూ.21.25పైసలు చెల్లించనున్నది.