దేశ వ్యాప్తంగా కరోనా కలవరం మళ్లీ మొదలయింది. ఇందులో భాగంగా దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో రోజురోజుకు కరోనా కేసుల నమోదు సంఖ్య ఎక్కువవుతుంది. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ గురించి గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఫ్రొపెసర్ రాజారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన మాట్లాడుతూ ఫోర్త్ వేవ్ కు అవకాశాలు చాలా తక్కువ. కానీ మే నేలలో మాత్రం కేసుల సంఖ్య ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికి కరోనా మహమ్మారి పీడ వదల్లేదు. ప్రస్తుతం ఉన్న డెల్టా,ఒమిక్రాన్ ,ఎక్స్ ఈలు సబ్ వేరియంట్లను వీటి ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది.
కరోనా కొత్త వేరియంట్లపై మరింత అప్రమత్తంగా ఉండాలి. రూపాంతరం చెందిన కరోనా కొత్త వైరస్ వేరియంట్ల ప్రతి ఆరు నెలలకు ఒకసారి పుట్టుకోస్తాయి. మూడొ వేవ్ లో నూతన వేరియంట్ ఒమిక్రాన్ బలహీన పడి పెద్దగా ప్రభావం చూపించలేదన్నారు ఆయన. రూపాంతరం చెందిన కరోనా వైరస్ మే ,జూన్ నెలలో నాలుగో వేవ్ రూపంలో కాకపోయిన కొంతమేర ప్రభావం చూపుతుంది. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.