రాష్ట్రంలో 91వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసేముందు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కసరత్తు చేసిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఉద్యోగార్థుల శిక్షణకు ఉస్మానియా, కాకతీయ, మహత్మాగాంధీ, పాలమూరు, తెలంగాణ, శాతవాహన యూనివర్సిటీల్లో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణా కేంద్రాలను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తొలుత పోలీసు, విద్య, వైద్యశాఖల్లోని ఖాళీలను భర్తీచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు ఆమె చెప్పారు. ఈ మూడు శాఖల్లోనే సుమారు 72వేలకు పైగా ఉద్యోగాలు ఉన్నాయని.. ఒక ఉద్యోగం రాకపోతే మరొకదానికి ప్రయత్నించే అవకాశముంటుందన్నారు. యూనివర్సిటీల్లోని శిక్షణ కేంద్రాల్లో విద్యార్థులకు మెటీరియల్ కూడా ఉచితంగా అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.