కేజీఎఫ్ఛాప్టర్2 ప్రదర్శిస్తున్న థియేటర్లో అనూహ్య ఘటన చోటుచేఉకుంది. ఇద్దరు యువకులు థియేటర్లో సీటు కోసం గొడవ పడ్డారు. ఈ క్రమంలో అందులోని ఓ వ్యక్తి తుపాకీతో ఎదుటి వ్యక్తిపై కాల్పులు జరిపాడు. వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని హవేరి జిల్లా షిగ్గాన్లోని ఓ థియేటర్లో కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా నడుస్తోంది.
మంగళవారం రాత్రి ఓ యువకుడు ముందు సీటుపై కాలుపెట్టి చూస్తుండగా.. అందులో కూర్చొన్న వ్యక్తి సీరియస్ అయ్యాడు. దీంతో ఇద్దరూ గొడవపడ్డారు. వెంటనే కోపోద్రిక్తుడైన వ్యక్తి.. బయటకువెళ్లి క్షణాల్లో తుపాకీతో మళ్లీ లోనికి వచ్చి సదరు యువకుడిపై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో ఆ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు చెప్పారు. కాల్పులు జరిపిన వ్యక్తి మాత్రం అక్కడి నుంచి పరారయ్యాడు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో థియేటర్లోని ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు.