తమిళ సూపర్ స్టార్ .ప్రముఖ హీరో విక్రమ్, డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో ఓ మూవీ రాబోతోందని కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు మురుగదాస్ చెప్పిన కథ విక్రమ్ కు నచ్చిందట. భారీ బడ్జెట్ మూవీలను నిర్మించే సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనుందట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులపై మురుగదాస్ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
