తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో.. నటుడు రాజశేఖర్ ,ప్రముఖ నిర్మాత నటి జీవిత ల తనయ అయిన శివానీ ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలకు ఎంపికైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు షేర్ చేసింది.
‘మీ అందరి ఆశీర్వాదాలు మరియు ప్రేమను కోరుకుంటూ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను. అవకాశం ఇచ్చిన ఫెమినా మిస్ ఇండియా ఆర్గనైజేషన్కు ధన్యవాదాలు’ అంటూ పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు, పలువురు సెలబ్రిటీలు శివానికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు.