తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ నగరంలోని పాతబస్తీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం శ్రీకారం చుట్టారు. రూ.495కోట్ల విలువైన ఆరు పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. మీర్‌ఆలం చెరువు వద్ద మ్యూజికల్ ఫైంటెన్‌ను కేటీఆర్ ప్రారంభించారు.
అలాగే ఎస్‌టీపీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలాపత్తర్‌లో పోలీస్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.పారిశుధ్య కార్మికులకు జీతాలను రూ.8వేల నుంచి రూ.17వేలకు పెంచినట్లు చెప్పారు.
అలాగే రూ.108కోట్ల వ్యయంతో పూర్తి చేసిన బహదూర్‌పుర ఫ్లై ఓవర్, రూ.35కోట్లతో చార్మినార్ వద్ద ముర్గీచౌక్ పునరుద్ధరణ, రూ.30కోట్లతో సర్దార్ మహల్ అభివృద్ధి, రూ.297.30 కోట్లతో కార్వాన్ నియోజకవర్గంలో సీవరేజీ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.