ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని దేవుడితో పోల్చారు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయన స్వామి. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న బడుగులకు సీఎం జగన్ ఇస్తున్న ప్రాధాన్యం చూసి తాము కూడా ఎస్సీలుగా పుడితే బాగుండేదనే భావనలో రెడ్లు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తామంతా దేవుడి ఫొటో బదులు సీఎం జగన్మోహాన్ రెడ్డి గారి ఫొటోతో చాంబర్లోకి ప్రవేశించి బాధ్యతలు స్వీకరించామని ఆయన అన్నారు.. అక్కడతో ఆగకుండా ఇంకొ అడుగు ముందుకెసి దేవుని లక్షణాలు కలిగిన మానవుడు సీఎం జగన్ అని కొనియాడారు. రెండోసారి పదవి దక్కుతుందని ఊహించలేదని, తనపై పెట్టిన బాధ్యతను నెరవేరుస్తానని ఆయన తెలిపారు.