తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మాటల మాంత్రికుడు.. స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ,సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి విదితమే. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారీవారి పాట సినిమా షూటింగ్ తో బిజీబిజీగా ఉన్నాడు.ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ మహేష్ సినిమా తెరకెక్కనున్నది ఫిల్మ్ నగర్లో వార్తలు గుప్పుమంటున్నాయి.
అయితే వీరిద్దరి కాంబోలో రాబోతొన్న ఈ మూవీలో మహేష్ బాబుకు తండ్రిగా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ సీనియర్ హీరో ను ఎంపిక చేయాలని చిత్రం యూనిట్ భావిస్తోందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ కు చెందిన సీనియర్ హీరో అనిల్ కపూర్ ను మహేష్ బాబు తండ్రిగా నటించమని కోరినట్లు వినికిడి.
దీనికి సంబంధించిన చర్చలు సాగుతున్నాయి. త్వరలోనే ఈ విషయం గురించి స్పష్టత రానున్నందని ఫిల్మ్ నగర్ లో టాక్. వచ్చే జూన్ నెల నుండి ఈ చిత్రం యొక్క రెగ్యూలర్ షూటింగ్ మొదలు కానున్నది. గతంలో అనిల్ కపూర్ బాపు దర్శకత్వంలో వంశవృక్షంలో నటించాడు.