దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత ఉందని.. పవర్ ఎక్స్‌ఛేంజ్‌ల్లోనూ ఇదే సమస్య ఉందని ఏపీ విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో వ్యవసాయం, పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా పవర్‌ను సప్లై చేస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 235 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉందని.. అందుబాటులో మాత్రం 150 మిలియన్ యూనిట్లే ఉందని చెప్పారు. వచ్చే నెల నుంచి కృష్ణపట్నం, ఎన్టీపీఎస్ ప్లాంట్ల ద్వారా మరో 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టామన్నారు. మే 1 నుంచి రాష్ట్రంలో పవర్ సప్లై నార్మల్‌కు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని పెద్దిరెడ్డి చెప్పారు.